ఆధునిక మహిళ – 1 – ఆధ్యాత్మికంగా జీవించే కల

100

స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారు స్త్రీ జాతి యొక్క ఉద్ధరణకై, వారిని చైతన్య పరుచుటకై, స్త్రీజాతిని జాగృత పరుచుటకై, వారి సామర్థ్యాలను, వారిలోని సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీసి, వారికి వారిని వెలుగును చేసి, ఈ విశ్వమంతా ఆ  వెలుగును ప్రసరింపచేయుటకై ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి’’ ని స్థాపించారు. ఇందులో 11 సంవత్సరాలకు పైబడిన మహిళలెవరైనా ఉచితముగా సభ్యత్వమును పొందవచ్చును. ఇది ‘‘ఓమౌజయ: ఆది సహాస్ర: పరిసంస్థాన్‌’’ లోని ప్రత్యేక విభాగము.
స్త్రీయే కుటుంబానికి బిందువు. స్త్రీయే సమాజానికి కేంద్రం. స్త్రీయే ప్రపంచానికి వృత్తం. స్త్రీ ప్రకృతి తత్త్వాన్ని మూర్తీభవించి ఉన్నది. జీవితంలోని బంధాలకు మూలము ఆమె! ధనముకు ఆది ఆమె! అటువంటి స్త్రీమూర్తి కుటుంబపరముగా, ప్రపంచపరముగా చిన్నచూపు చూడబడుచున్నది. ఆమెకు ఉండవలసిన స్థితి, స్థానం, స్థాయి, స్థానము కల్పించబడడం లేదు. పురుష చైతన్యానికి పాత్రురాలై తరించాల్సిన ఆమె పురుష అహంకారానికి బలి అగుచున్నది.
ఆచారం స్త్రీకి సంబంధించినది. వ్యవహారం పురుషుడికి సంబంధించినది. ఈ ఆచార వ్యవహారాలే సంస్కృతికి పునాది.ఈనాడు భారతీయ సంస్కృతి, మన సనాతన ఋషీధర్మపీఠము ఇంకా కొన ఊపిరితో నిలబడి ఉందంటే అందులో స్త్రీ పాత్ర ఎంతో ఉంది. ప్రతి స్త్రీ సంస్కృతిని ఆచరిస్తేనే అది కుటుంబ వ్యాప్తమై, సమాజ వ్యాప్తమై, ప్రపంచ వ్యాప్తమై భావితరాలకు అందచేయబడుతుంది. ప్రతి మానవుడికి మొట్టమొదటి బోధకురాలు తల్లి రూపంలో స్త్రీయే అయి ఉన్నది. కాబట్టి అంతరించిపోతున్న మన భారతీయ ఋషీ సంస్కృతిని తిరిగి మహిళల చేతిలో ఉంచి , భావితరాలకు ఆమెచే ఒక బాట వేయించడమే ఈయొక్క ‘‘ఓమౌజయ: విశ్వ మహిళా సేవాసమితి’’ ప్రధాన లక్ష్యం. జీవితంలో ఒక మహిళ పోషించే పాత్రలు ఎన్నో… ప్రతి పాత్రకు ఆమె న్యాయం చేసి తనకు తాను న్యాయం చేసుకునే విధంగా ఆమెను తీర్చిదిద్ది ముందుకునడిపించే ప్రయత్నమే ‘‘ఓమౌజయ: విశ్వ మహిళా సేవాసమితి’’ ప్రధాన ఉద్దేశము.
వేదాలకు పూర్వం స్త్రీలు ‘గురుని’లుగా ఉండి, గొప్ప ఆధ్యాత్మిక వేత్తలై విరాజిల్లుచుండేవారు.  వేదాలో కూడా ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీల ప్రస్తావన ఉన్నది. చరిత్రలో అక్కడా ఇక్కడ విప్లవాత్మకమైన  మహిళా ఆధ్యాత్మిక వేత్తలను మనము చూడవచ్చు. కాలాంతరంలో స్త్రీ ఆధ్యాత్మికతకు అనర్హురాలని, ఆమెకు స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండరాదని ప్రతి శాస్త్రము,ప్రతి పురాణము, ప్రతి గ్రంథము పురుషుడి చేతిలో మాత్రమే… పురుషుడి చుట్టూ మాత్రమే సాగింది.
అది సత్యం కాదు! స్త్రీలు ఆధ్యాత్మికమునకు అర్హులే! స్త్రీ స్వతంత్రానికి, స్వేచ్ఛకు అర్హురాలే! స్త్రీలు ఆధ్యాత్మికానికి అడ్డం కాదు! స్త్రీలు కూడా ఆధ్యాత్మికంగా ఎదిగి ఆత్మ సాక్షాత్కారం పొంది ‘గురుని’ లుగా వెగవచ్చు! అని పాత గీతను చెరిపివేసి మహిళలను ఒక నూతన క్రాంతి పథంలోనికి నడిపించుటకై జైమహావిభోశ్రీ: వారు ఈయొక్క ‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవా సమితి’’ ని  స్థాపించారు.
తద్వారా స్త్రీకి తనను తాను అర్థం చేయిస్తారు. పురుషుడికి స్త్రీ తత్త్వము గురించి అవగాహన కల్పిస్తారు. ప్రతి మహిళకు తన దేహ మనో ఆత్మ తత్త్వమును, ప్రకృతి రహస్యములను, అనంతమైన జ్ఞాన చైతన్యములను అందించడంలో ఈయొక్క‘‘ఓమౌజయ: విశ్వమహిళా సేవా సమితి’’ సఫలం అగుచున్నది. ప్రతి మహిళను జీవన్ముక్తి మార్గాలైన సేవ, దానం, ధ్యానం,సత్సంగం, సత్ప్రచారములో పాల్గొనేలా చేసి తద్వారా విశ్వకళ్యాణం, మానవకళ్యాణం, ప్రకృతికళ్యాణం, ఆత్మకళ్యాణం, మరియు ప్రపంచశాంతి కొరకై ఆమెను పాత్రురాలిని చేసి,వారి జన్మను పరిపూర్ణం చేసి ఫలింపజేయుచున్నది. ఈయొక్క‘‘ఓమౌజయ విశ్వమహిళా సేవాసమితి’’
కాబట్టి ఓ మహిళా మేలుకో… జైమహావిభోశ్రీ: వారిని చేరుకో..మానవ జీవన శిఖరాగ్ర ఫలమును అందుకో…

Category:

Additional information

Weight 0.231 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm