ఆధునిక మహిళ – 8 – స్వతంత్రమే స్త్రీకి గౌరవం

75

స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళలకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ- 8 ‘‘స్వతంత్రమే స్త్రీకి గౌరవం’’ అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారి రెండు ఓమౌజయ: విశ్వమహిళా సేవాసమితి సత్సంగాలను ఇవ్వడము జరిగినది.
ఈ పుస్తకము ద్వారా జైమహావిభోశ్రీ: వారు స్త్రీ తన జీవితంలో ప్రతి నిత్యం ఎదుర్కొనే సమస్యలను తన వస్త్రధారణను మార్చుకోవడం ద్వారా ఏవిధంగా పరిష్కరించుకోవచ్చో, మరియు రకరకాల రంగులను ఉపయోగించుకుని తన జీవితంలోని పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవచ్చో, ఇష్టకామ్యసిద్ధిని, సంకల్ప సిద్ధిని ఎలా పొందవచ్చో చాలా చక్కగా వివరించారు.
అలాగే వసుధైక కుటుంబ జగత్‌లో ఒక మహిళ పాత్ర ఏమిటి, కుటుంబంలో మరియు సమాజంలో స్త్రీ యొక్క స్థితి, స్థానం, స్థాయిలను గురించి మరియు ఒక స్త్రీ తన గృహమును శాంతితో, తృప్తితో, ప్రేమతో, ఆనందంతో ఎలా నింపాలో అద్భుతముగా వివరించారు.
 ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి, తాను తరించి, తన తోటి వారిని తరింపచేయవసిందిగా మనవి!
 ఈ పుస్తకము చదివి ఆదర్శ మహిళగా  వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను, అటు వారి జీవితాలను ధన్యము చేస్తారని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.285 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm