ఆధునిక మహిళ – 9 – మనసులో గురు జ్ఞాపకమే స్త్రీకి సంపద

111

ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను,
జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతన మైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.

ఆధునిక మహిళ-9 “మనసులో గురు జ్ఞాపకమే స్త్రీకి సంపద” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి రెండు ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి
సత్సంగములను ఇవ్వడము జరిగినది.

ఈ పుస్తకం ద్వారా జైమహావిభోశ్రీః వారు స్త్రీ యొక్క వ్యక్తిత్వం మరియు మనస్తత్వముల
గురించి, నిర్ణయ విచక్షణ గురించి, హృదయమును అనుసరించి జీవించడం గురించి, స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలలో వివరించారు. అలాగే కోరిక అనగానేమి, ఎటువంటి కోరికలను కోరుకోవాలి, పుణ్య కోరికలను, మోక్షంను ఇచ్చే కోరికలను
ఎలా కోరుకోవాలో చక్కగా వివరించారు.

ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి, తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి!
ఈ పుస్తకమును చదివి ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. మీరు
వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను
ధన్యము చేస్తారని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.33 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm