శ్రద్ధవాన్ లభతే జ్ఞానం-3
₹120
ప్రతి గురువారము స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారు హైదరాబాద్ ఆశ్రమము నందు సత్సంగములు బోధిస్తుంటారు. ఈ సత్సంగములలో మహోత్కృష్టమైనటువంటి ‘‘శ్రీగురుగీతా’’ గ్రంథ అంతరార్థమును,పరమార్థమును వివరిస్తుంటారు. అలాగే భక్తోమౌజయు యొక్క అనేక ఆధ్యాత్మిక సందేహాకు సమాధానాను ఇస్తుంటారు.
ఈయొక్క ‘‘శ్రద్ధవాన్ లభతే జ్ఞానం-3’’ గురువు ప్రేమలోనే మోక్షమున్నది అను పుస్తకమునందు నాలుగు గురువారపు దివ్య సత్సంగముల సారమును మీకు అందివ్వడం జరిగినది.
ఈ పుస్తకములో ఆధ్యాత్మికములో కుండళినీ యొక్క స్థితిగతు గురించి, శిష్యుడు గురువు యెడల పాటించవలసిన నిజాయితీతత్త్వమును గురించి, నిర్వాణోపాయముల గురించి, తపోధ్యానాదుల గురించి, ధర్మము, ధర్మ సూక్ష్మము, ఆపద్ధర్మముల గురించి, దేహమనోహృదయాత్మ సమన్వయ తత్త్వముల గురించి వివరించబడినది.
అలాగే ఆధ్యాత్మిక జగత్తులో గురుమార్గదర్శకం యొక్క మహాత్య్మము గురించి, యజ్ఞయాగాది క్రతువుల గురించి, వాస్తు శాస్త్రము గురించి, ప్రపంచంలోని వివిధ మతముల గురించి, అన్ని మతాలకు తల్లి వేరైనటువంటి హైందవ సంస్కృతి గురించి విశదీకరించబడినది.
అలాగే 112 ధ్యానము ఏకరూపమైనటువంటి ఓమౌజయ: పరబ్రహ్మ ధ్యానము గురించి, అనాహత నాదమైనటువంటి ఓంకార తత్త్వమును గురించి, జీవన్ముక్తి గురించి, గురుతత్త్వ ఆవశ్యకత గురించి తొలుపబడినది.
మంచిగా మెలగడము, మంచి తత్త్వమును పెంచడము, మానవతా తత్త్వము గురించి, సత్యమైన సద్గురు తత్త్వమును గురించి,అలాగే అసత్యమైన గురు వేషధారులు ప్రదర్శించు అద్భుత శక్తులు, సిద్ధులు మొదలైనటువంటి మహిమల వెనుక ఉన్న వాస్తవ అవాస్తవముల గురించి విపులీకరింపబడినది.
ఈ పుస్తకమును చదివి మానవ జన్మకు సత్యమైన సద్గురువు యొక్క ఆవశ్యకతను గుర్తెరిగి, ఆధ్యాత్మిక తత్త్వములోని ఎన్నోరహస్యములను మీరు తెలుసుకొని, మీ జీవితమును మీరు ఫలింపజేసుకొనుట కొరకై ఓమౌజయ: ధర్మ మార్గములోనికి మీరు ప్రవేశించి సద్గురువుల వారి అనుగ్రహమునకు మీరు పాత్రులు కాగలరని మేము ఆకాంక్షిస్తున్నాము. తద్వారా మానవ జన్మయొక్కపరమార్థ లక్ష్యమైనటువంటి జీవన్ముక్తిని పొంది మీకు మీరు సమాధానమై వెలిగి, ఈ ప్రపంచమునకు మీరు మీ సత్యవెలుగును ప్రసరింపచేయగరని మేము అభిలాషిస్తున్నాము.
Additional information
Weight | 0.438 kg |
---|---|
Dimensions | 25.4 × 19.5 × 2.54 cm |