శివ చైతన్య యోగ శాస్త్రం

240

స్వయంభూ: ఆది పరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారు అనేక ఆధ్యాత్మిక తత్త్వ యోగముల గురించి, సిద్ధి విద్యల గురించి, శాస్త్ర ప్రమాణముల గురించి, ప్రకృతి జీవన నిగూఢ రహస్యాల గురించి, మానవుడిని పరిపూర్ణుడిని చేసే జీవనశైలిని గురించి ‘‘ఓమౌజయ: ధ్యాన చైతన్య విహారయాత్ర’’  యందు విస్తారంగా వివరిస్తారు.
2014, మే 24,25,26వ తేదీలలో వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ నందు ‘‘శివ చైతన్య యోగం – ఆత్మ సిద్ధి” అను అంశంపై నిర్వహింపబడిన ‘‘ఓమౌజయ: ధ్యాన చైతన్య విహారయాత్ర’’ యొక్క సారాంశమును భక్తుల కోరిక మేరకు, సద్గురు ఆజ్ఞ మేరకు ఈ పుస్తకమును భక్తోమౌజయులకు అందజేయడం జరుగుతున్నది.
శివుడంటే ఎవరు, శివతత్త్వము ఎట్టిది, భూమికి ఉత్తర దిక్కున ఉండే 108 శివ తత్త్వ మండలాల ఉనికి గురించి, భూ మండలంపై వాటి యొక్క ప్రభావం గురించి, అవి ఎట్లు మానవుడి కర్మను, విధిని శాసిస్తున్నాయో అను అంశముల గురించి ఏ ఋషీ ఇంతవరకు దర్శించని రహస్యాలను సైతం, ఇంతవరకు ఎవరూ వివరించని రీతిగా పూజ్య జైమహావిభోశ్రీ: వారు ఈ  పుస్తకము నందు వివరించారు.
108 శివ మండలాలలో కొన్ని  మానవుడిని పురోగతి చెందిస్తాయి, కొన్ని తిరోగతిని చెందిస్తాయి కావున వాటి ప్రభావమునకు అతీతంగా మన అభీష్ట జీవితమును జీవించుటకై ముద్రను, దిక్కును, దృష్టిని, ఆసనమును, మంత్రమును మరియు ఈ 108 ముద్రా ధ్యాన సాధనల వలన కలుగు విశేష ప్రాపంచిక, ఆధ్యాత్మిక ఫలములను ఈ పుస్తకము నందు అందించడం జరిగినది.
 ఈ పుస్తకమును చదివి, ఈ సాధనలను ఆచరించి, సమస్త భౌతిక, ఆధ్యాత్మిక సర్వైశ్వర్యాలను పొందండి, మానవ జీవిత మాధుర్యపు అనుభూతిని చూరగొనండి..

Category:

Additional information

Weight 0.29 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm