పరబ్రహ్మ తత్వ దర్శనం 3
₹90
పరబ్రహ్మ తత్వ దర్శనం 3
గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయం ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తోమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.
గురుపౌర్ణిమ మహోత్సవ సందర్భంగా, రెండు వేరు వేరు ప్రదేశాలలో, జైమహావిభోశ్రీః వారు ప్రవచించిన అనుగ్రహ భాషణములు ఈ యొక్క పుస్తకం నందు ఇవ్వబడినవి.
ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం-3 (పూజించు జీవితమును – ఆరాధించు ఆత్మను) అను పుస్తకము నందు గురుపౌర్ణిమ మహోత్సవం యొక్క మహాత్మ్యము మరియు విశిష్టత గురించి, భారతీయ సంస్కృతీ సంప్రదాయ వైభోగం గురించి జైమహావిభోశ్రీః వారు మహోన్నతంగా వివరించారు. అహంకారం వీడి భగవంతుడిని ఎలా ప్రాప్తింపజేసుకోవాలో, సత్సంబంధాలతో ఎలా మెలగాలో చాలా చక్కగా వివరించారు. జీవితానికి ఔషధం గురువేనని, అట్టి గురుతత్త్వమును తిరిగి ఈ భూవిశ్వమందు పునః సంస్థాపించడమే ఓమౌజయః ధర్మస్థాపన యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఉద్భోధించారు.
“న గురోరధికం తత్త్వం. తస్మైశ్రీ గురవే నమః” అను శ్రీగురుగీత నందు గల ఈ శ్లోకం యొక్క పరమార్ధమును మరియు “శుక్లాం భరధరం విష్ణుం సర్వవిఘ్నోప శాంతయే” అను శ్లోకం యొక్క అంతరార్ధమును జైమహావిభోశ్రీః వారు ఈ పుస్తకము నందు ఉపదేశించారు.
ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు కండి. ఓమౌజయః
Description

Additional information
Weight | 0.306 kg |
---|---|
Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.