ఆధునిక మహిళ – 16 – నమ్మకానికి అమ్మనే స్త్రీ

167

ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను,జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ-16 “నమ్మకానికి అమ్మనే స్త్రీ” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః
ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.
ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు గాయత్రి మండలంలోని నాల్గవ పాదం
గురించి వివరించారు. ఇందులో ఒక స్త్రీ పోషించే పాత్రల గురించి, వాటిని ఎలా జయించాలి, సనాతన హైందవ ధర్మంలో చెప్పబడిన విద్యలను చిన్న చిన్న సూక్తుల ద్వారా చాలా సులభమైన రీతిలో జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించారు. అరిషడ్వర్గాలు అయినటువంటి
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఎలా జయించాలో అత్యద్భుతంగా వివరించారు.
గాయత్రి మాత యొక్క ఐదవ మండలం అయిన శ్రీరామ గాయత్రి గురించి, ఆరు
ధర్మాలైన కుటుంబ ధర్మం, ప్రకృతి ధర్మం, అధ్యాత్మిక ధర్మం, వృత్తి ధర్మం, వ్యక్తి ధర్మం,
శాస్త్రీయ మరియు సాంకేతిక ధర్మం గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఏ విధంగా
నవ్వాలి, నవ్వులు ఎన్ని రకాలు, వాటి వివరణను జైమహావిభోశ్రీః వారు చాలా చక్కగా వివరించారు.
ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.

Out of stock

Notify Me when back in stock

Category:

Additional information

Weight 0.3 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm