ఆధునిక మహిళ – 21
₹180
Description
ఆధునిక మహిళ – 21
తొలి పలుకు
ఓమౌజయః శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ-21 “మాతృదేవోభవ” అను ఈ పుస్తకము ద్వారా శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.
ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు ఇప్పుడు వసుధైక కుటుంబ వేడుకలు అంటే ఏమిటి? శ్రావణమాస ఏకాదశి మహోత్సవము దేనికొరకు జరుపుకుంటారు, మన జీవితములో ఏ లక్ష్యము కోసము ఈ జన్మ ఎత్తాము, ఏ కర్తవ్యము కోసము ఈ ప్రయాణము చేస్తున్నాము, ఏ జీవిత అనుభూతి కోసము తపిస్తూ ఉన్నామో, ఏ ఆనందమును ఆశించి ఈ లోకముకు వచ్చామో ఆ సంపదను సంపాదించుకోవడానికి ఆటంకాలుగా ఏమి ఉంటాయి. వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి అనే విషయాల గురించి, మన ఆత్మ లక్ష్యం ఎలా నెరవేర్చుకోవాలి, మన వృత్తిలక్ష్యాన్ని ఎలా ఫలింపచేసుకోవాలో మనకు అర్థమయ్యే భాషలో చాలా సులభంగా, మనం ఆచరించదగిన పద్ధతులతో జైమహావిభోశ్రీః వారు చాలా అద్భుతంగా వివరించారు.
ఓమౌజయాః శ్రీః నాద చక్ర ముద్ర గురించి, ఎదుటి వ్యక్తి గురించి ఎలా ఆలోచించాలి, ఎదుటివ్యక్తితో ఎలా స్పందించాలి, స్త్రీలు ఎదుటివ్యక్తి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి, సేవ చేసేటప్పుడు ఎలా ఉండాలి, సేవకులతో ఏ విధంగా ప్రవర్తించాలి. విశ్వమహిళ అనేవారు ఎలా ఉండాలి అనే విషయాల గురించి జైమహావిభోశ్రీః వారు వివరించారు.
ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.
ఇట్లు
ఓమౌజయాః మహాధర్మ సేవలో
ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి, హైదరాబాద్.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.