పరబ్రహ్మ తత్వ దర్శనం 11

160

ముందు మాట

గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయః ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.

ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం-11 “గురుపౌర్ణిమ మహాత్మ్యం” అను ఈ పుస్తకములో 2017 వ సంవత్సరంలో మహబూబ్నగర్ మరియు 2018వ సంవత్సరంలో కైకలూరులో నిర్వహింపబడిన గురుపౌర్ణిమ మహోత్సవ సత్సంగముల యొక్క సారాంశము ఇవ్వబడినది.

గురుపౌర్ణిమ రోజు ఏ శక్తి ఉత్పత్తి అవుతుంది. మనకు ఏ శక్తి అందుతుంది అనే విషయాల గురించి, మన జీవితంలో అత్యంత ముఖ్యమైన మూడు ధర్మాలైన కుటుంబధర్మం, వృత్తి ధర్మం, ఆధ్యాత్మిక ధర్మం గురించి జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించడం జరిగింది. కుటుంబంలో మనం ఎలా ఉండాలి, వృత్తిలో ఎటువంటి మైండ్సెట్ని కలిగి ఉండాలనే విషయాలను వివరించారు. మన జీవితంలో ఉండే 18 మంది గురువుల గురించి, వారి విశిష్టతను శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించారు.

అలాగే మహాధిపత్య చక్రాన్ని ఎలా సిద్ధింపచేసుకోవాలో, మన జీవితంలో ఉన్న 11 మంది గురువుల గురించి, 11 మంది గురువులు ఎవరు, వారు ఏ వయస్సులో ఉంటారు, వారి విశిష్టత ఏమిటి, వారిని ఎలా సొంతంచేసుకోవాలంటే ఎలా సంకల్పం చేయాలో శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు చాలా విపులంగా విశదీకరించారు.

ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు కండి. ఓమౌజయాః

ఇట్లు

ఓమౌజయః మహాధర్మ సేవలో

భక్తోమౌజయా  బృందం, హైదరాబాద్

Description

పరబ్రహ్మ తత్వ దర్శనం 11

Additional information

Weight 0.250 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.