శ్రద్ధవాన్ లభతే జ్ఞానం -15 “మానవ దేహ పుణ్య యాత్ర “

200

ముందుమాట

ఓమౌజయః శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రతి గురువారము హైదరాబాద్ ఆశ్రమము నందు గురుతత్త్వ విశిష్టతను తెలియజేసినటువంటి శ్రీగురుగీతా గ్రంథముపై ప్రవచిస్తారు. ఈ పుస్తకము నందు మూడు గురువారాల సత్సంగముల యొక్క సారాంశము మీకు అందించబడినది.

శ్రద్ధవాన్ లభతే జ్ఞానమ్ – 15 “మానవ దేహ పుణ్య యాత్ర” అను ఈ పుస్తకంలో అసలు గురువు అంటే ఎవరు, గురువు అనే శబ్దానికి అర్ధం ఏమిటి, అసలు గుణములు ఎన్ని ఉంటాయి, గుణములు అంటే ఏమిటి, వాటిని ఎలా మార్చుకోవాలి, భగవంతుడి పంచముఖ వ్యక్తీకరణలు అనగా ప్రసంగం, ప్రవచనం, ఉపదేశం, బోధ మరియు వ్యాఖ్య అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించారు.

దానం గురించి, నిద్రావస్థ, స్వప్నావస్థల గురించి, ఋణబంధాల గురించి ఇలా భక్తమౌజయుల యొక్క పలు ప్రశ్నలకు అందరికీ అర్థమయ్యే విధంగా, స్పష్టంగా వారికి జైమహావిభోశ్రీః వారు సమాధానాలను ఇవ్వడం జరిగింది.

కలియుగంలో గల నాలుగు పాదాల గురించి, కాల శ్రమ శాస్త్రం గురించి అందులో నీ కాలాన్ని ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, కాలాన్ని ఎలా సొంతం చేసుకోవాలి, ఎలా శ్రమించాలి, శ్రమించడం వలన ఉపయోగాలు ఏంటి, భార్యాభర్తలు కుటుంబంలో ఎలా ఉండాలి అనే అంశం గురించి, అన్యోన్య దాంపత్య సూత్రాలను జైమహావిభోశ్రీః చాలా చక్కగా వివరించారు.

ప్రతి మానవుడు ఈ పుస్తకమును చదివి, తన జీవితము నందు సద్గురువుల వారు బోధించినటువంటి జీవన విషయములను ఆచరించి, భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగలరని, సద్గురువుల వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదమును పొందగలరని సహృదయపూర్వకముగా ఆకాంక్షిస్తూ….

ఇట్లు

ఓమౌజయా: మహాధర్మ సేవలో

భక్తోమౌజయః బృందం

Category:

Additional information

Weight 0.46 kg
Dimensions 25.4 × 19.5 × 2.54 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.