AUYSA-1

60

ఓమౌజయ: ఆదిసహాస్ర: పరిసంస్థాన్‌లో (AUYSA) అనునది యువత యొక్క ప్రత్యేక విభాగము! AUYSA అనగా ( ఓమౌజయ: యునైటెడ్‌ యంగ్‌స్టార్స్‌ అసోసియేషన్‌) యువశక్తిని జాగృతం చేయడము, యువతను చైతన్యవంతం చేయడము, యువతను సుజ్ఞానులను చేయడము, AUYSA యొక్క ఉద్దేశము!
యువతలో సామాజిక సేవాతత్పరతను పెంపొందించడము, ప్రకృతి మాతను సంరక్షించడము, తిరిగి సనాతనధార్మిక విలువలను పెంపొందించడము, భారతీయ సంస్కృతిని కాపాడడము, విశ్వసౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడము,మానవత్వం, మంచితనమును పెంపొందించడమే AUYSA లక్ష్యం.
Be a leader to achieve the world.
Be a scientist to achieve the nature.
Be a master  to achieve the life.
AUYSA ప్రతి యువకుడిని తనను తాను నాయకుడిని చేసి ప్రపంచంపై విజయము సాధించేలా చేస్తుంది. తనకు తాను శాస్త్రజ్ఞుడిని చేసి ప్రకృతిపై విజయము సాధించేలా చేస్తుంది.
AUYSA ప్రతి యువకుడు తన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో, సామాజిక జీవితంలో,తన ఆధ్యాత్మిక జీవితంలో అజేయుడై పరిపూర్ణ మానవజీవితాన్ని జీవించేలా చేస్తుంది.
విద్యను మాత్రమే కాకుండా విద్యతో పాటు విలువలను కూడా అందించడమే AUYSA మూల సిద్ధాంతం! గొర్రె పిల్లల్లా పారిపోయే యువతను కాకుండా సింహాల్లా గర్జించి నిలబడే యువతను తయారుచేసి, వారిని ధీరోధాత్తులుగా అవతరింపచేయడమే AUYSA యొక్క మూలతత్త్వం!
జైమహావిభోశ్రీ: వారిచే యువతకు ప్రత్యేకంగా నిర్వహింపబడే సత్సంగాలలోని జ్ఞానాన్ని మీకీ పుస్తకముగా అందిస్తున్నాము.
ఇందులో AUYSA యొక్క ఆవిర్భావము గూర్చి, జీవితంలో తల్లితండ్రుల పాత్ర, ఉపాధ్యాయులపాత్ర, పిల్లల పాత్ర గురించి జైమహావిభోశ్రీ: వారు చక్కగా వివరించడం జరిగింది.
నేటి యాంత్రిక విద్యా వ్యవస్థకు, బరువు బాధ్యతను విస్మరించిన తల్లితండ్రులకు మరియు ఉపాధ్యాయులకు వను మరిచిపోయిన యువతకు ఈ పుస్తకం ఒక కనువిప్పు!
ఈపుస్తకాన్ని చదివి, అందరిచే చదివించి యువతను జాగృతపరచాలనే జైమహావిభోశ్రీ: వారి దివ్య సంక్పంలో మీరూ భాగస్వామ్యులు కండి!
Come! Join us! We are for excellent youth!

Category:

Additional information

Weight 0.23 kg
Dimensions 22.86 × 15.54 × 2.54 cm