AUYSA-6-నీలో నాయకుడిని మేలుకొలుపు
₹60
AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య జైమహావిభోశ్రీః వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
AUYSA ద్వారా ప్రతి యువకుడిని పూజ్యజైమహావిభోశ్రీః వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ AUYSA-6 ‘‘నీలో నాయకుడిని మేలుకొలుపు’’ అను ఈ పుస్తకంలో జైమహావిభోశ్రీ: వారు యువతకు ఇచ్చినటువంటి రెండు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల యొక్క సారాంశాన్ని మీకు అందిస్తున్నాము. ఈ పుస్తకములో భయమును అధిగమించడం ఎలా, భయమునకు గల మూల కారణాలు ఏవి అన్నది మరియు మనం స్వార్థం,అహంకారమును ఏ సందర్భాలలో కలిగి ఉండాలి, ఎప్పుడు కలిగి ఉండకూడదు అనునది మరియు గర్వము, ఆత్మగౌరవము, ఆత్మాభిమానముల గురించి జైమహావిభోశ్రీ: వారు చక్కగా విశ్లేషించారు.
తరువాత దేహమును నియంత్రించుకోవడం ఎలా, దానిని సమతుల్యముగా ఉంచుకోవడం ఎలా అన్నది, వాతము,పిత్తము, కఫము అను మూడు రకాల దేహతత్త్వాలు కలిగిన వారు పాటించవలసిన ఆహార నియమముల గురించి, వేయవలసిన ఆసనాల గురించి విశదీకరించడం జరిగినది.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి ఆచరించి ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా మనవి.
Additional information
Weight | 0.264 kg |
---|---|
Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |