AUYSA-2-యువశక్తి జాగ్రుత ముద్రా శాస్త్రము

90

స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారు యువత కొరకు ప్రత్యేకముగా స్థాపించిన విభాగమే AUYSA . AUYSA అనగా Aumaujaya United Youngstars Association (ఓమౌజయ: యునైటెడ్‌ యంగ్‌స్టార్స్‌ అసోసియేషన్‌) యువతను శక్తివంతం చేసి, చైతన్యవంతులను చేసి, ఒక ఆదర్శవంతమైన యువతను అవతరింపచేయడమే AUYSA  లక్ష్యం.
సామాజిక సేవ, ప్రకృతి సంరక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం , భారతీయ ఋషీ సంస్కృతి యొక్క పునరుద్ధరణ, విశ్వ సౌభ్రాతృత్త్వం, మానవత్వం, మంచితనం లను పెంపొందించడమే  AUYSA యొక్క ఆశయం.
ప్రతి యువకుడిని ఒక నాయకుడిగా, ఒక శాస్త్రజ్ఞుడిగా, ఒక గురువుగా, ఒక తత్త్వజ్ఞుడిగా, ఒక మానవతావాదిగా తయారు చేయడమే  AUYSA ధ్యేయం.
 AUYSA -2 అను ఈ పుస్తకము సమకాలీన యువతకు విద్యారంగంలో, వృత్తిలో, కుటుంబంలో, సమాజంలో, జీవితంలో తాము ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా రూపొందించబడినది. ప్రతి సమస్య పరిష్కారమునకై జైమహావిభోశ్రీ: వారు ఎంతో కరుణతో, ప్రేమతో ఒక ముద్రను, దృష్టిని, సాధన చేయవలసిన సమయాన్ని, సాధనచేయునపుడు పాటించవలసిన ఆహార నియమాలను అందించారు.
ఈ ఆత్మచైతన్య ముద్రాధ్యాన సాధన ద్వారా ఎందరో యువతీయువకులు, బాలబాలికలు తమతమ సమస్యలను పరిష్కరించుకున్నారు. ఇది సశాస్త్రీయంగా నిరూపించబడినది. కావున మీరు ప్రతి ఒక్కరూ ఈ ముద్ర సాధనను చేసి మీరు మీ జీవితంలో విజయం సాధించి, మీరు వెలిగి, ఈ ప్రపంచాన్ని వెలిగించాని ఆశిస్తున్నాము. ప్రతి విధ్యార్థి, ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరవలసిన పుస్తకము ఇది.
ఈ పుస్తకంలోని ముద్రా ధ్యాన సాధన మీరు చేయ సంకల్పించుకున్నప్పుడు, స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారిని దర్శించి వారి ఆజ్ఞను పొంది, సాధనకు ఉపక్రమించినచో, మీరు సర్వోత్కృష్టమైన ఫలితాలను పొందగలరు.

Category:

Additional information

Weight 0.31 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm