AUYSA-3-విజయ మార్గం

90

AUYSA ( Aumaujaya United Young Stars Association) అనునది జైమహావిభోశ్రీ: వారు యువతను మేల్కొలిపి, వారిని చైతన్యవంతం చేసి, వారిని జ్ఞానులుగా తీర్చిదిద్ది, సర్వ మానవ శ్రేయస్సుకై నిలిచే మానవత్వం, మంచితనం, ప్రేమతత్త్వం కలిగిన, నిత్య నూతన యవ్వనత్వం కలిగిన ప్రపంచ విజేతలుగా వారిని తీర్చిదిద్దుటకై స్థాపించిన సేవా సంస్థ!
AUYSA ద్వారా ఎంతోమంది యువతీ యువకులు ప్రేరేపితులై వారికి వారు నాయకులై, శాస్త్రజ్ఞులై, గురువులై, తత్త్వవేత్తలై, మానవతావాదులై వెలిగి ఎంతోమందికి ఆదర్శవంతులై నిలవడానికి జైమహావిభోశ్రీ: వారు చూపిన బాటలో పయనిస్తున్నారు.
ఈ విజయమార్గం అనే పుస్తకము ప్రత్యేకంగా యువత కొరకై రూపొందించబడినది. ఇందులో విద్యావ్యవస్థకు ఆయువుపట్టైన అంశాలైనటువంటి ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తుల గురించి అనన్య సామాన్యమైన రీతిలో నిరుపమానమైన విధముగా జైమహావిభోశ్రీ: వారు విస్తారంగా వివరించారు.
అలాగే పుస్తకం చివరలో యువత చదివిన వెంటనే చైతన్యాన్ని పొంది, వారి జీవితాలులో ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకొని, ఉరకలేస్తూ ఉత్సాహంగా విజయపథంలో సాగిపోయి, జీవన శిఖరాగ్ర ఫలాలను కైవసంచేసుకుని, జగత్‌ జీవన విజేతలై విరాజిల్లే విధముగా జైమహావిభోశ్రీ: వారిచే ‘‘యువసూక్తులు’’ చెప్పబడినవి.
ఇది యావత్‌ యువతరం చేత, ప్రతి విద్యావేత్త చేత, ప్రతి బోధకుడి చేత, ప్రతి సంఘ సంస్కర్త చేత, ప్రతి ఉపాధ్యాయుడి చేత, ప్రతి తల్లి చేత, ప్రతి తండ్రి చేత తప్పక చదివబడాల్సిన పుస్తకము ఈ పుస్తకాన్ని చదివి ఆచరించి ఆదర్శనీయులై వెలగండి! మీలా పదిమందిని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దండి!

Category:

Additional information

Weight 0.342 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm