ఆధునిక మహిళ – 5 – మహిల సమగ్ర శ్వరుపం-శంవ్రుద్ధి జీవన కల

60

స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళలకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారము హైదరాబాద్‌ ఆశ్రమము నందు జైమహావిభోశ్రీః వారి యొక్క దివ్య సత్సంగాలు మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించబడును. ఈ పుస్తకములో జైమహావిభోశ్రీః వారి యొక్క ఒక దివ్య సత్సంగములలోని విషయాలను మీకు అందించడం జరిగినది.
ఇది ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి ద్వారా  వెలువడిన ఐదవ పుస్తకం. ఈ ఆధునిక మహిళ-5 (మహిళ సమగ్ర స్వరూపం – సంవృద్ధి జీవన కళ ) అను పుస్తకంలో స్త్రీలకు ప్రత్యేకమైన శ్రీచక్ర దర్శనం  మరియు సుదర్శన చక్ర దర్శన ప్రక్రియ యొక్క దృష్టిని వివరించడం జరిగినది. ఒక గృహంలో స్త్రీ యొక్క నిత్యావసరం, అత్యవసరం, అవసరం, కోరిక, అవకాశమును ప్రాప్తింపజేసుకొనుటకు తరుణోపాయములను వివరించడం జరిగినది. అందుకు స్త్రీ ఏ విధముగా సహనమును, త్యాగమును, ముందుచూపును, సమతుల్యతను, సమైక్యతను కలిగి ఉండాలో బోధించడం జరిగినది. ఒక స్త్రీ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, గృహంలో అందరి యొక్క ఆరోగ్యానికి ఎలా కారకురాలు కావాలో, స్త్రీ నిత్యం శాంతిగా ఉంటూ, గృహంలో శాంతిని ఎలా స్థాపించాలో, ఎలా సత్సంబంధాలను నెలకొల్పాలో, తన జీవితంలో తాను విజయాన్ని పొంది, ఆధ్యాత్మికంగా భగవంతుని ఎలా ప్రాప్తింపజేసుకోవాలో బోధించడం జరిగినది.
ఈ పుస్తకము చదివి ఆదర్శ మహిళగా  వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. మీరు వెలిగి పదిమంది జీవితాలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను, అటు వారి జీవితాలను ధన్యము చేస్తారని అభిలాషిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.237 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm