శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం-7

80

స్వయంభూ: ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీ: వారు ప్రతి గురువారము ఓమౌజయ: ఊర్జీశా నిలయము (One man-One globe ) హైదరాబాద్‌ నందు గురుతత్త్వ విశిష్టతను యావత్‌ విశ్వమునకు తెలియజేసినటువంటి శ్రీగురుగీతా గ్రంథముపై ప్రవచిస్తారు.
శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం -7 సాహస సంకల్పముతో ప్రయాణం అను ఈ పుస్తకంలో సద్గురువుల వారి యొక్క మూడు గురువారముల సత్సంగముల యొక్క సారాంశాన్ని భక్తోమౌజయులకు అందించడం జరిగినది. మనపై పడుతున్న నకరాత్మకత నుండి ఎలా బయట పడాలి, ఓమౌజయ: నాదం యొక్క అర్థం ఏమిటి, మహామూల మంత్రం యొక్క విశిష్టత ఏమిటి, బ్రహ్మరహస్యం అనగానేమి, ధనమును ఏ విధంగా సంపాదించాలి, మన జీవితంలో సేవ మరియు దానము యొక్క ప్రాధాన్యత ఏమిటి, మన మనస్సును, బుద్ధిని, చిత్తమును, అహంకారమును శుద్ధి చేసుకుని, ఏవిధముగా మన ఆధ్యాత్మిక
జీవితము లోనికి యోగ్యత సంపాదించుకోవాలి అను అంశము గురించి జైమహావిభోశ్రీ: వారు మహాద్భుతంగా వివరించారు.
మన సహజత్వముతో మనం ఎలా జీవించాలి, అందుకు మన అంతరంగ హృదయముతో ఎలా అనుసంధానం అవ్వాలి, మనం ఎక్కడ ఉన్నా సద్గురు సన్నిదానములో ఉన్న అనుభూతిని ఎలా పొందాలి, స్త్రీ, పురుషుల యొక్క ఏడు దేహము, వాటి తత్త్వమును గురించి, ధ్యాన అనుభవాలు వాటి అర్థాల గురించి, మనో సంతృప్తితో, హృదయానందముతో, అంతరంగ ఆత్మ మౌనముతో, నిత్యం వర్తమానంలో ఎలా జీవించాలో జైమహావిభోశ్రీ: వారు చాలా చక్కగా వివరించారు.
మంచి చెడునగానేమి, ఏవి మన జీవితంలో తప్పు ఒప్పు, సత్ప్రచారము చేయడమనునది ధ్యాన సాధనలో మనను ముందుకు ఎలా తీసుకువెళుతుందనే విషయము గురించి జైమహావిభోశ్రీ: వారు సోదాహరణముగా వివరించారు.
ప్రతి మానవుడు ఈ పుస్తకమును చదివి, తమ జీవితమునందు సద్గురువుల వారు బోధించనటువంటి జీవన విషయములను ఆచరించి, భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగలరని, సద్గురువుల వారి కృపకు పాత్రులై, మానవ జన్మ పరమపదమును పొందగరని సహృదయ పూర్వకముగా ఆశిస్తూ…
సదా ఓమౌజయ: మహాధర్మ సేవలో
ఓమౌజయ: సేవక బృందం, హైదరాబాద్‌.

Category:

Additional information

Weight 0.359 kg
Dimensions 25.4 × 19.5 × 2.54 cm