ఆధునిక మహిళ – 12 – విద్య మరియు ఆధ్యాత్మికతనే మహిళకు సత్కీర్తి
₹189
ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని
స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ
సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ-12 “విద్య మరియు ఆధ్యాత్మికతనే మహిళకు సత్కీర్తి కిరీటాలు” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి రెండు ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.
ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు సనాతన హైందవ భారతీయ ఋషీధర్మ
సంస్కృతి ఒక స్త్రీకి ఆపాదించినటువంటి ఆచార వ్యవహారములను, కట్టుబాట్లను, సభ్యత సంస్కారాలను చాలా చక్కగా వివరించారు. ఒక మహిళ బొట్టు ఎందుకు ధరించాలి, చెవిదిద్దులను ఎందుకు ధరించాలి, ముక్కెరను ఎందుకు ధరించాలి, గాజులను ఎందుకు ధరించాలి, మెట్టెలను ఎందుకు ధరించాలి, ఏ ఏ రంగు దుస్తులను ఏ ఏ రోజులలో, ఏ ఏ సమయ సందర్భాలలో
ధరించాలి, కుటుంబంలో, సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాలను చాలా హృద్యంగా
వివరించారు.
అలాగే శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, కళ్యాణమస్తు మరియు తథాస్తు అను తత్త్వములను భౌతిక, ఆధ్యాత్మిక, కుటుంబిక, సామాజిక, ప్రాపంచిక రంగములకు ఆపాదించి చాలా చక్కగా వివరించారు.
ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో
వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని
అభిలాషిస్తున్నాము.
Additional information
Weight | 0.345 kg |
---|---|
Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |